నిమ్స్‌‌‌‌‌‌‌‌లో మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించండి ..మంత్రి దామోదరకు ప్రెస్ క్లబ్ పాలకమండలి విజ్ఞప్తి 

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించండి ..మంత్రి దామోదరకు ప్రెస్ క్లబ్ పాలకమండలి విజ్ఞప్తి 

​​​​​​హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న నిమ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మెంబర్ల కోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ పాలకమండలి మంత్రి దామోదర రాజనర్సింహను కోరింది. సోమవారం  ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్​ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఆయనకు వినతి పత్రం అందించారు. స్పందించిన మంత్రి హెల్త్ క్యాంప్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినాను ఆదేశించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  మంత్రికి, ప్రభుత్వానికి క్లబ్ పాలక మండలి కృతజ్ఞతలు తెలిపింది.