హైదరాబాద్: ఆదాయం తక్కువగా ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడంతో గిగ్ వర్కర్లపై ఒత్తిడి పెరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం (డిసెంబర్ 29) సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లకు ఇన్సెంటివ్ వచ్చే టైంలోనే ఉద్యోగం తొలగిస్తున్నారని అన్నారు. డిమాండ్ల సాధన కోసం గిగ్ వర్కర్ల డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నారని తెలిపారు. గిగ్ వర్కర్ల సమస్యల కోసం రాహుల్ గాంధీ మాట్లాడారని గుర్తు చేశారు. గిగ్ వర్కర్స్ బిల్లులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. గిగ్ వర్కర్లపై కేంద్రం నిర్ణయం తీసుకుని వాళ్లను ఆదుకోవాలని కోరారు.
