ఇవాళ ( నవంబర్ 21 ) హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిది షెడ్యూల్ ఇదే..

ఇవాళ ( నవంబర్ 21 ) హైదరాబాద్ కు రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిది షెడ్యూల్ ఇదే..

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రానున్నారు. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి.. శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్​భవన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.

కంటోన్మెంట్, వెలుగు: శీతకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రానున్నారు. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి.. శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకొని సాయంత్రం 4.00 గంటలకు అక్కడ జరిగే భారతీయ కళా మహోత్సవం రెండో ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తారు. 

ఈ వేడుకల్లో దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి పలువురు నృత్య కళాకారులు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 6:15 గంటలకు రాష్ట్రపతి తిరిగి రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకొని.. రాత్రి బస చేయనున్నారు. 22న (శనివారం) ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి.. సత్యసాయి శత జయంత్యోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌‌‌‌కు రానున్నారు. 

అనంతరం డిసెంబర్ 21 వరకు ఆమె ఇక్కడే ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు.