
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పూజ చేయడానికి వెళ్లిన పూజారి మంగళవారం రన్నింగ్ లిఫ్ట్ కిందపడి పూజారి మృతి చెందాడు. తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. మారేడ్ పల్లిలోని డి.ప్రీతం ఇంట్లో పూజ నిర్వహించడానికి వచ్చిన పూజారి నర్సింహా మూర్తి లిఫ్ట్ రాక ముందే గేట్ తెరచి అందులోకి ప్రవేశించాడు. లిఫ్ట్ గ్రౌండ్ లో పడిపోయాడు. అంతలోనే పైనుంచి లిఫ్ట్ వచ్చి మీద పడిపోయింది. దీంతో పూజారి నర్సింహా మూర్తి చనిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.