సూర్యాపేట జిల్లాలో పీఏసీఎస్ చైర్మన్ పై అవిశ్వాసం

సూర్యాపేట జిల్లాలో పీఏసీఎస్ చైర్మన్ పై అవిశ్వాసం
  • కోర్టు ఆదేశాల కారణంగా రిజల్ట్​ ప్రకటించని డీసీవో

హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌ యరగాని శ్రీనివాస్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చైర్మన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాస తీర్మానం కోరుతూ ఆ సంఘం డైరెక్టర్లు గతేడాది డిసెంబర్ 22న డీసీసీబీ అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అదే నెలలో 27న డీసీసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. 

సంఘం డైరెక్టర్లు హైకోర్టుకు వెళ్లి అవిశ్వాస సమావేశం జరిగేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. దీంతో ఈనెల 29న అవిశ్వాస సమావేశం నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం సొసైటీ కార్యాలయంలో జిల్లా డీసీవో సురవజ్జుల పద్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 12 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. కానీ, డీసీవో పద్మ మాత్రం ఫలితాన్ని ప్రకటించలేదు.

 హైకోర్టు ఆదేశాల మేరకు జూన్ 12న ఫలితాన్ని వెల్లడించనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ముత్తయ్య ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయం వద్ద భారీ పోలీస్‌‌‌‌‌‌‌‌ బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో  డైరెక్టర్లు కంచర్ల మధుసూదన్ రెడ్డి, ఇందిరాల లక్ష్మి, దేవరం మల్లేశ్వరి, గోసుల శ్రీను, జక్కుల మల్లమ్మ, దుగ్గి బ్రహ్మం, కటారు శ్రీను, కందుల పద్మ , మీసాల శ్యామ్ సుందర్, భూక్యా లచ్చిరామ్ నాయక్, జక్కుల నరేందర్, రాయల వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్​పద్మ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజయ్య, ఆడిటర్ అంజయ్య, సీఈవో పులిచింతల నరేంద్దర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.