కోట్లు ఖర్చుపెట్టి చేసే పనిని ఫ్రీగా చేసి పెట్టిన ప్రధాని మోడీ !

కోట్లు ఖర్చుపెట్టి చేసే పనిని ఫ్రీగా చేసి పెట్టిన ప్రధాని మోడీ !

ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భేటీలో పార్లే ఆహార ఉత్పత్తుల్లో ఒకటైన మెలోడీ చాక్లెట్ హైలైట్ అయింది. ఆమెకు ఈ దేశీ చాక్లెట్ ప్యాకెట్ను ప్రధాని మోడీ గిఫ్ట్గా ఇచ్చిన వీడియో వైరల్ అయింది. ఈ పరిణామంతో.. సోషల్ మీడియాలో పార్లే మెలోడీ చాక్లెట్ ట్రెండింగ్లో నిలిచింది.

దెబ్బకు.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. వాస్తవానికి ప్రధాని మోదీ పార్లే ఇండస్ట్రీస్కు పరోక్షంగా చాలా మంచి చేశారు. ఎందుకంటే.. ఇదే పార్లే కంపెనీకి చెందిన ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి సెలబ్రెటీలయితే కోట్లలో పారితోషికం తీసుకుంటారు. ఆ హీరోకు ఉండే క్రేజ్ను బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది.

షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ అయితే 5 నుంచి 15 కోట్లు.. మెస్సీ, రొనాల్డో లాంటి వరల్డ్ పాపులర్ సెలబ్రెటీలు అయితే.. 100 నుంచి 200 కోట్లు.. ఇలా తమ ప్రొడక్ట్స్ ను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం కోట్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అవసరం లేకుండా పార్లే కంపెనీకి చెందిన మెలోడీ చాక్లెట్లను మెలోనీకి గిఫ్ట్గా ఇచ్చి.. మోడీ ఇలా పరోక్షంగా మేలు చేశారు.

►ALSO READ | దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుంటే.. మోడీ మెలోనికి చాక్లెట్లు పంచుతుండు: రాహుల్ విమర్శలు

పార్లే ప్రొడక్ట్స్ వంటి వారసత్వ బ్రాండ్‌కు.. ఇద్దరు ప్రపంచ నాయకులు ఒక దౌత్యపరమైన భేటీతో.. డబ్బుతో వెలకట్ట లేని ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చారు. అయితే.. ఈ పార్లే కంపెనీ ఏం చిన్నాచితకా బ్రాండ్ కాదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బ్రాండ్ 100కు పైగా దేశాల్లో తమ ప్రొడక్ట్స్ అమ్ముతుంది.