బీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం: ప్రధాని మోదీ

బీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం: ప్రధాని మోదీ

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని..ప్రజాధనాన్ని లూటీ చేసినవాళ్ల సంగతి తేల్చుతామన్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని..కొడుకు, బిడ్డా కోసం పనిచేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ డీఎన్ ఏ ఒక్కటేనని మూడు పార్టీలు కుటుంబ పాలన కోరుకుంటున్నాయిని మోదీ విమర్శించారు. అహంకార సీఎంకు బీసీలు ఓటుతో బుద్ధి చెప్పాలని అని ప్రధాని మోదీ అన్నారు.

తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు  కోసం.. కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు మోదీ. నిరుద్యోగులను  కేసీఆర్ సర్కార్ నిండా ముంచిందని.. టీఎస్ పీఎస్సీని అక్రమాల పుట్టను చేశారని విమర్శించారు.