బడ్జెట్ పై ఆర్థిక వేత్తలతో మోదీ చర్చ

బడ్జెట్ పై ఆర్థిక వేత్తలతో మోదీ చర్చ
  • కేంద్ర మంత్రులు నిర్మల, రావ్​ ఇంద్రజిత్ ​హాజరు

న్యూఢిల్లీ: మోదీ 3.0 ప్రభుత్వం మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కు వేగంగా అడుగులు పడుతున్నాయి. జూన్ 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీ గురువారం నీతి ఆయోగ్ ​బిల్డింగ్​లో కేంద్ర మంత్రులు, సీనియర్​ఆఫీసర్లు, ఆర్థిక నిపుణలతో సమావేశమై చర్చించారు. 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ ద్వారా రోడ్ మ్యాప్‌‌ను రూపొందించే అవకాశం ఉన్నట్టు ఎనలిస్టులు చెప్తున్నారు.

ఈ సమావేశంలో  కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్, కేంద్ర ప్లానింగ్ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, అశోక్ గులాటీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సంస్కరణలను స్పీడప్​ చేయడానిక ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తుందని, విజన్, దీర్ఘాకలిక లక్ష్యాలను సాధించేలా బడ్జెట్ ఉంటుందని పార్లమెంటులో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా బడ్జెట్  ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇన్​ఫ్లేషన్​ కంట్రోల్, ఆర్థికవృద్ధిని స్పీడప్​ చేసే చర్యలు, సామాన్యులకు పన్ను మినహాయింపును అందించాలనే డిమాండ్స్ ను కూడా పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉందంటున్నారు.