ఎంపీగా మోదీ ప్రమాణం

ఎంపీగా మోదీ ప్రమాణం

18వ లోక్ సభ ఫస్ట్ సెషన్ ప్రారంభమయ్యింది. సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేస్తున్నారు. ముందుగా ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్  ప్రమాణం చేయించారు. మోదీ తర్వాత రాధామోహన్ సింగ్, ఫగన్ సింగ్, రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా, నితిన్ ఘడ్కరీ ప్రమాణం చేశారు.   సభ్యులంతా ఒక్కొక్కరుగా ప్రమాణం చేస్తున్నారు.

జూన్ 24న 280 మంది ప్రమాణం చేయనున్నారు. 25న  తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేసే అవకాశం ఉంది.  జూన్ 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి. జులై 2 లేదా 3న ఎంపీల ప్రశ్నలకు మోదీ జవాబులిస్తారు. తర్వాత ఉభయ సభల వాయిదా పడే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కోసం  జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.