శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఇవాళ(గురువారం) మధ్యాహ్నం కొలంబో నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో బయలు దేరిన ఆయన.. ఉదయం 11.37 గంటలకు రేణిగుంటకు చేరుకున్నారు.ఆయనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయలతో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ హార్దిక స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీలంక ప్రధాని రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరి వెళ్ళారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న రాజపక్స కుటుంబం.. రేపు(శుక్రవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనుంది. శ్రీలంక ప్రధాని రాకతో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అన్నిరకాల భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. చేసింది.
మరిన్ని వార్తల కోసం...
తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు !
