
హిందూ దేవుళ్లు, దేవతల ఫోటోలతో పటాకులు/ బాణాసంచా అమ్మకాలు, తయారీ పై హెచ్చరికలు జారీ అయ్యాయి. దింతో మతపరమైన మనోభావాలను కించపరిచే పటాకుల విక్రేతలపై సెక్షన్ 295A కింద అధికారులు చర్యలు తీసుకోనున్నారు, అలాగే వారిపై FIRలు నమోదు చేయనున్నారు.
ఎవరైనా ఇలాంటి బాణసంచా అమ్మితే సంబంధిత షాపు, తయారీ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. గత కొన్నేళ్లలో జరుగుతున్న ఇలాంటి సంఘటనల కారణంగా మత విశ్వాసం దెబ్బతింటోందని, ఏ మతాన్ని అవమానించకుండా ఉండేలా గట్టి నిఘా పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. హిందూ దేవుళ్లు, దేవతల ఫోటోలతో బాణసంచాని మార్కెట్‌లో అమ్ముతారు. ఈ బాణసంచా ప్యాకెట్లపై ఉన్న ఫోటోలు తరువాత రోజు ఉదయం రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉండటం దీనికి కారణం. అందుకే బాణసంచా అమ్మే విక్రేతలపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు.
ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే బాణసంచా తయారీ సంస్థ సహా వాటిని తెచ్చి విక్రయించిన దుకాణదారుడిపై కూడా కేసు నమోదు చేయనున్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్రంలో సహా అన్ని జిల్లా వ్యాపారులను హెచ్చరించింది.
లక్ష్మీ దేవి లేదా హనుమాన్ వంటి హిందూ దేవతల ఫోటోలతో బాణసంచా తయారీ లేదా అమ్మడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యగా పరిగణించి, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 295A ప్రకారం, మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడానికి ఏదైనా ఉద్దేశపూర్వక లేదా హానికరమైన చర్య చట్టం ప్రకారం శిక్షార్హమైనది, ఇందుకు కేసు (FIR) నమోదు చేయడం లేదా జైలు శిక్ష విధించవచ్చు.
ఈ చట్టం ప్రజలు అలాగే అమ్మకందారులు పండగలను జరుపుకునేటప్పుడు మత విశ్వాసాన్ని గౌరవించాలని గుర్తు చేస్తుంది. పవిత్ర చిహ్నాలను రక్షించడం వల్ల వేడుకలు సాంస్కృతిక లేదా చట్టపరమైన సరిహద్దులను దాటకుండా ఆనందంగా, గౌరవప్రదంగా ఉండేలా చూస్తుంది.