ఏపీ జైళ్లశాఖలో ఉద్యోగాలు.. జస్ట్ 5th క్లాస్ పాసైతే చాలు

ఏపీ జైళ్లశాఖలో ఉద్యోగాలు.. జస్ట్ 5th క్లాస్ పాసైతే  చాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జైళ్ల శాఖ ఫార్మాసిస్ట్, వాచ్ మెన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 29. 
పోస్టుల సంఖ్య: 04. 
పోస్టులు: ఫార్మాసిస్ట్ గ్రేడ్–11 01, ఆఫీస్ సబార్డినేట్ 01, వాచ్​మెన్ 01, డ్రైవర్ (ఎల్ఎంవీ) 01. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఫార్మా, ఎం.ఫార్మా, డి.ఫామ్, పదో తరగతి, ఏడో తరగతి, ఐదో తరగతిలో
ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: 18 నుంచి 42 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 15.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 29. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

►ALSO READ | HAL Recruitment 2025 : ఒక్క ఎగ్జామ్ తో HAL లో మంచి జాబ్ కొట్టొచ్చు