Aadujeevitham: ఆడు జీవితం తెలుగు కలెక్షన్స్ని మధ్యలోనే ఆపేలా చేసిందెవరు?

Aadujeevitham: ఆడు జీవితం తెలుగు కలెక్షన్స్ని మధ్యలోనే ఆపేలా చేసిందెవరు?

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్ లైఫ్‌‌’ (ఆడు జీవితం).  విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజయింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 

నైంటీస్‌‌లో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఇది.నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను ఎంతో హర్ట్ టచ్ అయ్యేలా తెరకెక్కించారు.ఈ సినిమా మలయాళంలో భారీ సక్సెస్ అయింది. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఆదరణకు, తెచ్చిన కలెక్షన్స్ కు సంబంధం లేకుండా పోయింది.అంతేకాదు..కంటెంట్ ఓరియెంటెడ్ మూవీని తెలుగు ఆడియన్స్ తిరస్కరించారని ఆరోపిస్తూ మలయాళ సినీ ఫ్యాన్స్ తెలుగు ఆడియన్స్ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతలా తెలుగు ప్రజలు కనెక్ట్ అయిన మూవీకి కలెక్షన్స్ విషయంలో ఎక్కడ బ్రేక్ పడిందో చూద్దాం. 

అయితే, ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..ఒక భాషలో హిట్టైన సినిమా మరో భాషలో కూడా సక్సెస్ అవ్వాలని సూత్రం అయితే లేదు. ఈ మధ్యనే మలయాళ నుంచి వచ్చిన ప్రేమలు మూవీని తెలుగు ఆడియన్స్ ఎంత పెద్ద సక్సెస్ చేశారో చూశాం. కానీ, అంతకు మించి పేరు తెచ్చుకున్న ఆడు జీవితం సినిమాకు మాత్రం కలెక్షన్స్ పెద్దగా రాలేదు.దానికి ముఖ్య కారణం..'టిల్లు స్క్వేర్'అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

'ఆడు జీవితం' వచ్చిన తర్వాతి రోజున 'డీజే టిల్లు' సీక్వెల్ రిలీజ్ అయ్యింది.తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఎక్కడా ఆగకుండా సక్సెస్ ఫుల్గా దూసుకుపోయింది. కంటెంట్ వైస్ పృథ్వీరాజ్ సినిమా బెస్ట్ అనిపించుకున్నప్పటికీ, తెలుగు ఆడియన్స్ ఒరిజినల్ తెలుగు మూవీకే ప్రాధాన్యత ఇచ్చారని వసూళ్లు చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ మలయాళ డబ్బింగ్ మూవీ వేరే డేట్ కి వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ మూవీని తెలుగు ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ బడా బ్యానర్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్స్ బాగానే చేసారు. అంతేకాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ హైదరాబాద్ కు వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, తనవంతు సపోర్ట్ సైతం చేసారు. 

ఇక సినిమా రిలీజైన తర్వాత ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు భారీ స్థాయిలో దక్కాయి. దాదాపు అన్నిమీడియా నుంచి కూడా రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి. చివరికి బుక్ మై షోలో 9.5 రేటింగ్ కూడా వచ్చింది. కానీ దానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం రాలేదు. అయితే, సక్సెస్ అంటే కేవలం డబ్బులే కాదు..మనసుని హత్తుకునే ఆదరణ కూడా!