Aadujeevitham: తెలుగు థియేటర్లోకి వచ్చేస్తున్న ఆడు జీవితం..పృథ్వీరాజ్‌ అసాధారణ నటన డోంట్ మిస్

Aadujeevitham: తెలుగు థియేటర్లోకి వచ్చేస్తున్న ఆడు జీవితం..పృథ్వీరాజ్‌ అసాధారణ నటన డోంట్ మిస్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించిన చిత్రం ది గోట్ లైఫ్(The Goat Life)(ఆడు జీవితం). బెన్యామిన్ రాసిన గోట్ డేస్ అనే నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దీన్ని తెరకెక్కించారు.

నైంటీస్‌‌‌‌‌‌‌‌లో సౌదీ అరేబియాకు జీవనోపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ ఇది. బలవంతంగా బానిసగా గొర్రెల కాపరీగా మారిన ఓ వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు  మార్చి 28న వస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ తెలుగు రిలీజ్ హక్కులను టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంది. దీంతో ఈ సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు సొషల్మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

'తాజాగా స్పెషల్ షో చూసిన విశ్వ నటుడు,3 జాతీయ అవార్డులతో సత్కరించబడిన కమల్ హాసన్ తన అభిప్రాయం పంచుకుంటూ..ఆడు జీవితం నటి నటుల అసాధారణ నటనను మెచ్చుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను వెంటనే థియేటర్లలో చూడటానికి టికెట్లను బుక్ చేసుకోండి' అంటూ కోరారు. 

ఆడు జీవితం సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అదేంటంటే..పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందించిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇండియన్ సినిమా ఇది కావడం విశేషం.దాదాపు ఐదేళ్లు ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా కష్టపడ్డానని పృథ్వీరాజ్‌‌‌‌‌‌‌‌ ఎన్నోసార్లు స్టేజీ పైన చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఈ సినిమా కోసం మెగాస్టార్వాడి చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్స్ ను చనువుతో వదులుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్‍కు తన కెరీర్లోనే చాలా క్లిష్టతరమైన మేకోవర్ తో, యాక్టింగ్ తో సాహసం చేశానంటూ అనేక సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు. 

అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, ప్రముఖ అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మార్చి 28వ తేదీన మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో రిలీజ్ కానుంది