మీ పిల్లలకేమైనా బాధ్యత మీదే

మీ పిల్లలకేమైనా బాధ్యత మీదే
  • పేరెంట్స్ నుంచి కన్సెంట్‌ లెటర్లు 
  • తీసుకుంటున్న ప్రైవేటు స్కూళ్లు 
  • లెటర్లు ఇవ్వకపోతే స్టూడెంట్లను 
  • అనుమతించబోమని సర్క్యులర్లు 
  • సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఫిజికల్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లకు వచ్చే పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యత తల్లిదండ్రులదేనని ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు అంటున్నాయి. ఇందుకోసం పేరెంట్స్‌ నుంచి కన్సెంట్‌ లెటర్లు తీసుకుంటున్నాయి. లెటర్లు ఇవ్వకపోతే స్టూడెంట్లను అనుమతించేది లేదని సర్క్యులర్లు జారీ చేస్తున్నాయి. పిల్లలకు ఏమైనా అయితే బాధ్యత తమదేనంటూ స్కూళ్లు లెటర్లు రాయించుకోవడమేంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సర్కారు స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లలకు కరోనా సోకితే ఇంటికి పంపాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసోలేషన్‌ సెంటర్లు పెట్టి ట్రీట్‌మెంట్‌ ఇప్పించకుండా ఇంటికి పంపడమేంటని విమర్శిస్తున్నారు.
సర్కారు ఉత్తర్వులివ్వకున్నా..
రాష్ట్రంలో 10 వేలకు పైగా ప్రైవేటు స్కూళ్లలో దాదాపు 32 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. చాలా రోజుల తర్వాత సెప్టెంబర్‌ 1 నుంచి ఫిజికల్ క్లాసులు మొదలవుతున్నాయి. అయితే పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం చూపొచ్చని ప్రచారం జరుగుతున్న టైమ్‌లో అంగన్‌వాడీ నుంచే ఫిజికల్ క్లాసులు చెప్పాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

కరోనా కేసులు ఇంకా తగ్గకముందే డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫిజికల్ క్లాసులకు పర్మిషన్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 2020–21లో ఫిజికల్ క్లాసులకు హాజరయ్యే స్టూడెంట్ల పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నో ఆబ్జెక్షన్, డిక్లరేషన్, కన్సెంట్ లెటర్లను స్కూళ్లు తీసుకున్నాయి. ఈ ఏడాది అవి తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులివ్వలేదు. అయినా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు కన్సెంట్ లెటర్ ఉంటేనే క్లాసులకు అనుమతిస్తామని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలిస్తున్నాయి.  
మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లే లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి..
ఫిజికల్ క్లాసుల కోసం స్కూళ్లకు వచ్చే స్టూడెంట్లకు ఏమైనా జరిగితే బాధ్యత పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు చెబుతున్నాయి. దీనిపై పేరెంట్స్ నుంచి బలవంతంగా లెటర్లు రాయించుకుంటున్నాయి. మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ప్రిపేర్ చేసిన ఫార్మాట్ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పేరెంట్స్ సంతకం చేస్తేనే స్టూడెంట్లను స్కూళ్లకు అనుమతిస్తామని చెప్తున్నాయి. ‘ఓన్ రిస్క్, రెస్పాన్సిబిలిటీతో నా పిల్లలను బడికి పంపిస్తున్న. పిల్లల ఆరోగ్య విషయంలో స్కూల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాధ్యత లేదు. స్కూల్ గైడ్ లైన్స్ పాటించకపోతే నా పిల్లలను అనుమతించకండి’ అంటూ హైదరాబాద్​ అబిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేటు స్కూల్.. పేరెంట్స్​ కన్సెంట్ ఫాం రూపొందించింది.  ‘నా ఇష్టపూర్వకంగానే పిల్లలను బడికి పంపుతున్నా. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే స్కూల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్పాన్సిబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు’ అంటూ రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ చేసింది. దీని ఆసరాగా బడుల్లో ఏమైనా జరిగితే తమ బాధ్యత లేదంటూ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు చేతులెత్తేసే అవకాశముందని పేరెంట్స్​ చెప్తున్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.


బాధ్యత మాదే అంటే ఎట్ల? 
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా ఇద్దరు పిల్లలు 5, 7 తరగతులు చదువుతున్నారు. వాళ్లు స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలంటే కన్సెంట్ లెటర్ ఇవ్వాలని అంటున్నారు. దాంట్లో పిల్లల బాధ్యత మాదేనని, స్కూల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది ఏం ఉండదని ఉంది. ఇదేంటని అడిగితే ఇష్టముంటే పంపండి లేకుంటే లేదంటున్నారు.                                                                                                                                       - మాధవి, పేరెంట్, హైదరాబాద్
ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించకుండా ఇంటికి పంపుతమంటరా?
సర్కారు స్కూళ్లు, హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాల్సిన బాధ్యత హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లదేనని ప్రభుత్వం చెప్పింది. గత విద్యాసంవత్సరం స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా ఐసోలేషన్ సెంటర్లు పెట్టారు. ఈ ఏడాది అలాంటి ఆదేశాలేం ఇవ్వలేదు. స్టూడెంట్లలో ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలుంటే హెడ్మాస్టర్లు దగ్గరలోని పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకి వాళ్లను తీసుకెళ్లి కరోనా పరీక్ష చేయించాలని సర్కారు ఉత్తర్వులిచ్చింది. కరోనా వస్తే ఆ స్టూడెంట్లను పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించాలని సీఎం కేసీఆరే ప్రకటించారు. దీనిపై పేరెంట్స్ మండిపడుతున్నారు. ఐసోలేషన్ సెంటర్లు పెట్టి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించకుండా ఇంటికి పంపాలని సర్కారు చెప్పడమేంటని నిలదీస్తున్నారు.