ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. చిన్నారి మృతి

ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. చిన్నారి మృతి

కొత్తకోట, వెలుగు: డాక్టర్ల ట్రీట్​మెంట్ ఫెయిలై పసికందు మృతి చెందిన విషాద ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిమెట్ట గ్రామానికి చెందిన బిసన్న సుజాత దంపతులకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు. ఆ చిన్నారికి శుక్రవారం ఆయాసం రావడంతో కొత్తకోటలోని ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. మూడ్నెళ్లు ఉన్న ఆ పసికందును పిల్లల డాక్టర్ పరీక్షించి ఏమీ పరవాలేదు, నయం అవుతుందని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. ఆ తర్వాత.. పిల్లల డాక్టర్ ఊరికెళ్లడంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బందే ట్రీట్​మెంట్ అందించారు. ఆదివారం సాయంత్రం ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చంటిబిడ్డ కండిషన్ సీరియస్ గా ఉందంటూ తమకు ఇన్ఫామ్ చేయడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి వెళ్లగా పసికందు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది వేసిన ఇంజక్షన్ల కారణంగానే తమ కొడుకు చనిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.