రెమెడిసివిర్ ఇంజెక్షన్లను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలె

రెమెడిసివిర్ ఇంజెక్షన్లను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలె

ఆదిలాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంఆర్పీ ధరలకే రెమిడిసివిర్ ఇంజక్షన్లు అమ్మాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నెల రోజుల్లో కరోనా డెత్ రేట్ చాలా తగ్గిపోయిందన్న ఇంద్రకరణ్..
ప్రభ్యత్వ చర్యలతోనే వైరస్ వ్యాప్తి, మరణాలను అదుపు చేశామన్నారు. వివిధ రాష్ట్రాల రోగులు రావడం వల్లే హైదరాబాద్ లో మనవాళ్లకు బెడ్స్ దొరకడం లేదని తెలిపారు. 
కొవిడ్ చికిత్సలో మన రాష్ట్ర పేషంట్స్ కే మొదటి ప్రియారిటీ, తర్వాతే ఇతర రాష్ట్రాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బార్డర్ లో పూర్తిస్థాయి నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.