సారూ.. మాకేదీ సాయం.. ప్రైవేట్ లెక్చరర్ల ఆవేదన

సారూ.. మాకేదీ సాయం.. ప్రైవేట్ లెక్చరర్ల ఆవేదన
  • సారూ.. మాకేదీ సాయం
  • ప్రైవేట్ కాలేజీల లెక్చరర్ల ఆవేదన
  • విద్యావలంటీర్లు, గెస్ట్ లెక్చరర్లకు ఏడాదిగా జీతాల్లేవ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సాయం ప్రకటించిన ప్రభుత్వం.. ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్లను మరిచింది. కరోనా ఎఫెక్ట్ తో ప్రై

వేట్ కాలేజీలూ మూతపడ్డాయని, తమకూ మేనేజ్​మెంట్లు జీతాలు ఇవ్వడం లేదని లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో పని చేసే విద్యా వలంటీర్లు, పార్ట్ టైమ్ ఇన్​స్ర్టక్టర్లు, కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లను ఈ అకడమిక్​ఇయర్ లో ప్రభుత్వం రెన్యూవల్ చేయలేదు. దీంతో జీతాల్లేక వీళ్లూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీచర్లకు పైసలిచ్చి తమకు ఇవ్వరా అని వీళ్లంతా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

ఏడాదిగా జీతాల్లేవ్...  
‘‘ప్రైవేట్ సెక్టార్​ లో ఒక్కరిని కూడా ఉద్యోగంలో నుంచి తీసేయొద్దు. అందరికీ జీతాలివ్వాలి’’ అని లాక్​డౌన్ విధించిన కొత్తలో ప్రభుత్వం చెప్పింది. కానీ వాటిని అమలు చేయలేదు. విద్యాశాఖలో పనిచేసే హవర్లీ బేస్డ్, గెస్ట్ టీచర్లు, లెక్చరర్లు, విద్యా వలంటీర్లు కలిపి 40 వేల మందిని రెన్యూవల్ చేయకుండా రోడ్డున పడేసింది. వీళ్లకు నెలకు రూ.18 వేల నుంచి రూ.21 వేల జీతం అందేది. ఇప్పుడు డిజిటల్ తరగతులు ప్రారంభమైనా డ్యూటీలోకి తీసుకోలేదు. ఏడాదిగా జీతాల్లేక ఇబ్బంది పడుతున్నారు. సర్కార్, ఎయిడెడ్ స్కూళ్లలో ‘మిడ్ డే మీల్స్’ వండి పెట్టేందుకు 55 వేల మంది వర్కర్స్ పని చేస్తున్నారు. వీరికి నెలకు కేవలం రూ. వెయ్యి గౌరవ వేతనం అందేది. బడులన్నీ మూతబడడంతో అవీ రావట్లేదు. దీంతో  కూలీ పనులకు వెళ్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేసే మరో 28,200 మంది స్కావెంజర్లను ప్రభుత్వం తీసేయడంతో వాళ్లూ ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా జీతాల్లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్లకు రూ.2 వేలు ప్రకటించడం వాళ్లను అవమానించడమేనని పలువురు అభిప్రయాపడుతున్నారు.

ప్రైవేట్ లెక్చరర్లను ఆదుకోవాలి 
ప్రభుత్వం ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్లను ఆదుకోవా లి. వాళ్లకు ప్రతినెల రూ.5 వేలు, 50 కిలోల బియ్యం ఇయ్యాలి. చాలామంది లెక్చరర్లు ఉపాధి హామీ పనులకు,  కూలీకి వెళ్తున్నారు. 
- గౌరీ సతీశ్, కన్వీనర్, కేజీ టు పీజీ జేఏసీ 

రోడ్డున పడ్డాం  
పదేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మమ్మల్ని రోడ్డున పడేశారు. కరోనా పేరుతో   జాబ్​ రెన్యూవల్ చేయలేదు. రెన్యూవల్ చేసి సగం జీతమైనా ఇయ్యాలి. ఆర్థిక సాయం మాకు వర్తింపజేయకపోవడం బాధాకరం. 
- మంగ, విద్యా వలంటీర్​, గౌరిపల్లి (సిద్దిపేట)