మహబూబాబాద్ లో బస్సు ప్రమాదం

మహబూబాబాద్ లో బస్సు ప్రమాదం
  • ఒకరికి తీవ్ర గాయాలు
  • ఐదుగురు పిల్లలకు స్వల్ప గాయాలు

తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరం మండలం బొమ్మకల్ శివారులో ఓ ప్రైవేట్​ స్కూల్​ బస్సును మరో ప్రైవేట్​ స్కూల్​ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. తొర్రూరుకు చెందిన సెయింట్​పాల్స్, రత్న ప్రైవేట్ స్కూళ్లకు చెందిన బస్సులు సోమవారం ఉదయం పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్నాయి.

ఈ క్రమంలో ముందు వెళ్తున్న సెయింట్​ పాల్స్​ స్కూల్​ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రత్న స్కూల్​ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బొమ్మకల్ గ్రామానికి చెందిన నిమ్మల అంజయ్య రత్న స్కూల్​ బస్సును లిఫ్ట్ అడిగి ఎక్కగా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగినప్పుడు రెండు బస్సుల్లో సుమారు 20 మందిపైగా పిల్లలున్నారు.