తొమ్మిదో తరగతి స్టూడెంట్‌కు రూ.2.92 లక్షల ఫీజు

తొమ్మిదో తరగతి స్టూడెంట్‌కు రూ.2.92 లక్షల ఫీజు

కరోనా టైమ్‌లో ఎక్కువ ఫీజుల వసూలు

ప్రైవేటు స్కూళ్లపై హైకోర్టు కు రాష్ట్ర సర్కార్ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: కరోనా కష్టకాలంలో ప్రైవేట్‌‌ స్కూళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేశాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పర్మిషన్‌‌ లేకుండా ఆన్‌‌లైన్‌‌లో క్లాసులు చెబుతున్న ప్రైవేట్‌‌ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్లపై​ విచారణ సందర్భంగా విద్యాశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పిటిషన్​పై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ నిర్వహిస్తోంది. ‘‘11 ప్రైవేట్‌‌ స్కూళ్ల తనిఖీల కోసం ప్రభుత్వం ఇద్దరు పెద్దాఫీసర్లతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల రిపోర్టులను హైకోర్టుకు విద్యాశాఖ కౌంటర్‌‌ పిటిషన్‌‌ ద్వారా అందించింది.  విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల విషయంలో వెసులబాటు ఉండేలా ట్యూషన్‌‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్​లో జీఓ జారీ చేసింది. దానిని పది స్కూళ్లు తుంగలోకి తొక్కాయి. కొత్తగా చేరిన స్టూడెంట్స్ నుంచి డిపాజిట్‌‌ను సైతం వసూలు చేశాయి. అన్ని ఫీజులను కలిపి ట్యూషన్‌‌ ఫీజుగా చూపాయి. బంజారాహిల్స్‌‌లోని మెరిడియన్‌‌ స్కూల్‌‌ 2019–20 ఏడాది తొమ్మిదో తరగతి స్టూడెంట్‌‌ నుంచి రూ.2.92 లక్షలకుపైగా వసూలు చేసింది. ఇందులో రూ.1.36 లక్షలకుపైగా ట్యూషన్‌‌ ఫీజుగా చూపించింది. ఇంత మొత్తాన్ని ట్యూషన్‌‌ ఫీజుగా చూపిందంటే, ఇతర ఫీజులు కూడా వసూలు చేసినట్లుగా స్పష్టమవుతోంది. జూబ్లీహిల్స్‌‌ పబ్లిక్‌‌ స్కూల్‌‌ నెలవారీ ఫీజుల పేరుతో గత ఆగస్టు వరకు వేరే ఫీజుల్ని కలిపి వసూలు చేసింది. హిమాయత్‌‌నగర్‌‌ ఆక్స్ ఫర్డ్‌‌ గ్రామర్‌‌ స్కూల్, అమీర్‌‌పేట్‌‌ నీరజ్‌‌ పబ్లిక్‌‌ స్కూల్, హైదరాబాద్‌‌లోని గీతాంజలి స్కూల్, మణికొండలోని మౌంట్‌‌ లిటెరాజీ స్కూల్స్‌‌  డిపాజిట్లను వసూలు చేశాయి” అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌‌కుమార్‌‌ వివరించారు. సీబీఎస్‌‌ఈ తరఫు న్యాయవాది వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రానందున ఈ పిల్స్​ విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది.

For More News..

అర్ణబ్ గోస్వామికి 14 రోజుల రిమాండ్

రైజర్స్‌ జోరు సాగేనా! నేడు బెంగుళూరుతో ఎలిమినేటర్ మ్యాచ్