కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రైవేట్ టీచర్ల ఆందోళన

కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రైవేట్ టీచర్ల ఆందోళన

స్కూళ్ల మూసివేతపై ప్రైవేట్ టీచర్లు ఆందోళనకు దిగారు. తమను ఆదుకోవాలంటూ టీచర్లు.. బాబాసాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలపై చిన్నచూపు చూస్తుందని శంషాబాద్ ప్రైవేట్ ఉద్యోగ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌బీ నగర్ నుంచి శంషాబాద్ బస్టాండ్ వరకు నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో ప్రైవేట్ టీచర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రైవేటు టీచర్లు మాట్లాడుతూ.. బార్లు, వైన్స్‌లు, పలు వాణిజ్య వ్యాపార సంస్థలు తెరిస్తే రాని కరోనా.. స్కూళ్లు తెరిస్తేనే వస్తుందా అని ప్రశ్నించారు. మూసివేసిన స్కూళ్లను వెంటనే తెరిచి.. ప్రైవేట్ టీచర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకొవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు.