
గండిపేట, వెలుగు: వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. నాగపూర్ నుంచి శంషాబాద్ వైపు హిమాయత్‌సాగర్ ఔటర్‌పై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్తోంది. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతల రోడ్డు వైపు దూసుకెళ్లింది. అటుగా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. తొమ్మిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఔటర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.