సెమీస్‌లో ఓటమి.. అయినా పతకం ఖాయం.. ప్రియ, కపిల్‌కు కాంస్యాలు!

సెమీస్‌లో ఓటమి.. అయినా పతకం ఖాయం.. ప్రియ, కపిల్‌కు కాంస్యాలు!

బాక్సింగ్‌‌‌‌లో ఇండియా బాక్సర్ల పతకాల జోరు కొనసాగుతోంది.  కాంస్య పతకాలు సాధించగా, స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ లవ్లీనా బొర్గోహైన్‌‌‌‌ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల ఫైనల్‌‌‌‌ చేరిన తొలి ఇండియన్‌‌‌‌ బాక్సర్‌‌‌‌గా రికార్డులకెక్కింది. 60 కేజీల విభాగంలో ప్రియా గంగాస్‌‌‌‌ 1–4 తేడాతో యాంగ్‌‌‌‌ చెంగ్‌‌‌‌ యు (చైనా) చేతిలో, 90 కేజీల్లో కపిల్‌‌‌‌ 1–4తో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ తురాబెక్‌‌‌‌ ఖాబిబుల్లాయేవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌) చేతిలో ఓడారు.

 విమెన్స్‌‌‌‌ 75 కేజీల సెమీస్‌‌‌‌లో లవ్లీనా 3–2తో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ నతాలియా బొగ్దనోవా (కజకిస్తాన్‌‌‌‌)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. దాంతో కనీసం రజత పతకమైనా  ఖాయం చేసుకుంది. స్వర్ణ పోరులో లవ్లీనా.. జియి బావో (చైనా)తో తలపడనుంది. పర్వీన్ హూడా (65 కేజీలు), అంకుశ్ పంగల్ (80 కేజీలు) స్వర్ణ పతకాల కోసం బరిలోకి దిగనున్నారు.