ఒక్క పోస్టుతో రూ.5 కోట్లు సంపాదిస్తున్న విరాట్ కోహ్లి

ఒక్క పోస్టుతో రూ.5 కోట్లు సంపాదిస్తున్న విరాట్ కోహ్లి

- రూ.3 కోట్లు ఆర్జిస్తున్న ప్రియాంక చోప్రా

న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి జనాల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ధనాధన్ బ్యాటింగ్, స్టైలిష్ డ్రెస్సింగ్, అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో క్రికెట్ అభిమానులతోపాటు సామాన్య జనం కూడా తనను ఫాలో అయ్యేలా చేస్తున్నాడు విరాట్. అందుకే అడ్వర్టయిజ్‌మెంట్ సంస్థలు అతడి ఇంటి ముందు క్యూ కడతాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌‌లో విరాట్ పోస్టులకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే కోహ్లి చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు ఇన్‌స్టా రూ.5.08 కోట్లు ముట్టజెప్పుతోంది.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న ఫేమ్ గురించి తెలిసిందే. హిందీలో టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంకకు హాలీవుడ్‌లోనూ క్రేజ్ పెరుగుతోంది. బేవాచ్, ఏ కిడ్ లైక్ జేక్, రొమాంటిక్, ది స్కై ఈజ్ పింక్ లాంటి మూవీలతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆమె అలరించింది. అందుకే తన జీవితంలోని విశేషాలు, సినిమా కబుర్లను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌‌లో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే పిగ్గీ చాప్స్ చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు ఇన్‌స్టా రూ.3 కోట్లు ముట్టజెప్పుతుండటం చూస్తే ఆమెకు ఉన్న పాపులారిటీ ఎంతో చెప్పొచ్చు. ఇన్‌స్టా రిచ్ లిస్ట్‌లో ఆమె 27వ పొజిషన్‌లో ఉంది. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క ప్రమోషనల్ పోస్టుకు 19వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో క్రేజీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రూ.11.09 కోట్ల ఆదాయంతో టాప్‌‌లో ఉండగా.. మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ (ది రాక్) రూ.11.03 కోట్ల ఆదాయంతో సెకండ్ పొజిషన్‌లో నిలిచాడు.