
ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాతృత్వాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తోంది. సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే.. సమయం చిక్కినప్పుడల్లా ఆమె తన కుమార్తె మాల్తీ మేరీతో గడుపుతోంది. ఈ సందర్భంగా తన కూతురుతో ఉన్న ఫొటోలను ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫొటోల్లో తన కూతురిని చేతుల్లో పట్టుకొని ఉన్న సెల్ఫీ ఒకటి కాగా... రెండవ చిత్రంలో, మాల్తీ రెండు పాదాలు ప్రియాంక ముఖాన్ని తన్నడాన్ని గమనించవచ్చు. ఈ ఫొటోలతో పాటు ఈ ప్రేమను మరెవ్వరికీ పంచలేను అనే క్యాప్షన్ ను జత చేసింది. ఈ పిక్స్ లో ప్రియాంక తెల్లని చొక్కా, ఆలివ్ గ్రీన్ షార్ట్‌లతో కనిపించగా... నల్లపూసలతో ఉన్న మాల్తీ కాళ్లను చూడవచ్చు.
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక పాపకు తల్లిదండ్రులు అయ్యారు. జనవరిలో సరోగసీ ద్వారా పుట్టిన ఈ చిన్నారి పుట్టినప్పటి నుంచీ ఈ ప్రియాంక దంపతులు మాల్తీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకూ ఒక్క ఫొటోలనూ మాల్తీ ముఖం కనిపించకుండా వారు జాగ్రత్తపడడం చెప్పుకోదగిన విషయం. కాగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లు డిసెంబర్ 2021 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో చాలా ఆడంబరంగా, అభిమానుల మధ్య వీరి పెళ్లి -జరిగింది. వారి పెళ్లి తర్వాత ఇండియాతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనూ పలు చోట్ల రిసెప్షన్‌లు ఏర్పాటు చేశారు.