
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట..త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. రేపు (సెప్టెంబర్ 24న) రాజస్థాన్ ఉదయ్ పూర్ కోటలోని లీలా ప్యాలెస్ లో మ్యారేజ్ జరగనుంది.
ఈ వివాహానికి పరిణీతి చోప్రా సోదరి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) డుమ్మా కొడుతోందా? అంటే అవుననే మీడియాలో కథనాలొస్తున్నాయి. రేపు జరగబోయే వీరి పెళ్లి వేడుకలో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జోడీ సందడి ఉంటుందని అందరూ ఊహించారు. తన చిట్టి చెల్లెమ్మ పరిణీతి పెళ్లిలో పీసీ తప్పక వాలిపోతుందని, బోలెడంత హంగామా సృష్టిస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే!
ప్రియాంక చోప్రా ఇన్స్టా వేదికగా పరిణీతి పెళ్లి సందర్భంగా ఒక అందమైన ఫోటోను పోస్ట్ చేసి ఇలా రాసింది.. మీ బిగ్ డే మీరు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను..అని వ్యాఖ్యానించింది. ఇన్‌స్టాగ్రామ్స్టోరీని బట్టి చూస్తే ప్రియాంక ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నందున తన చెల్లెలు పరిణీతి పెళ్లికి రావడం లేదనే విషయం అర్ధమవుతోంది. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అటెండ్ అవుతుందో..లేదో చూడాలి మరి.
వీరిద్దరి మ్యారేజ్కు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢీల్లి చీఫ్ మినిష్టర్ అరవింద్ కేజ్రీవాల్, ఇండియన్ పొలిటిషన్, సోషల్ వర్కర్ భగవంత్ మాన్ అటెండ్ కానున్నారు.వీరితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు రానున్నారు. ఈ నెల (సెప్టెంబర్ 30 న) చండీఘడ్లో ఘనంగా రిసెప్షన్ వేడుకలు జరుగనున్నాయి.