ప్రియాంక కు కేంద్రం షాక్.. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం

ప్రియాంక కు కేంద్రం షాక్..  ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల‌ని ఆమెకు ఆదేశ‌మిచ్చింది. ఆగస్టు 1 నాటికి బంగ్లా ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు రాయితీతో కూడిన అద్దెతో బంగ్లా లో ఉండొచ్చ‌ని తెలిపింది. ఆగస్ట్‌ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక లోధి ఎస్టేట్‌లోని 35వ నెంబర్ ప్ర‌భుత్వ‌ బంగ్లాలో నివాస‌ముంటోంది. ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఎస్‌పీజీ భద్రతను తొలగించింది. ఈ నేప‌థ్యంలో లోథీ రోడ్‌లోని ప్ర‌భుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది.

Priyanka Gandhi asked to vacate govt bungalow in Delhi by next month