రాహుల్ మాట్లాడింది హిందువులపై కాదు.. సోదరుడికి ప్రియాంక మద్దతు

 రాహుల్ మాట్లాడింది హిందువులపై కాదు.. సోదరుడికి ప్రియాంక మద్దతు

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తన మొదటి ప్రసంగంలో కేంద్రంలోని NDA సర్కార్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రాహుల్‌ గాంధీ. అయితే రాహుల్ తన ప్రసంగంలో  హిందువులని చెప్పుకునే బీజేపీ నేతలు హింసను ప్రేరేపిస్తుందని, హిందుత్వం పేరుతో దేశ ప్రజలను  బీజేపీ భయపడెడుతుందంటూ ఆయన చేసిన కామెంట్స్ దూమారం రేపాయి.  

అయితే రాహుల్ చేసిన కామెంట్స్ పై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. హిందు సమాజాన్ని మొత్తం హింసవాదులతో పొల్చడం సీరియస్ మ్యాటర్ అని అన్నారు. దీనికి మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిస్తే మొత్తం హిందు సమాజం అవ్వదు అని రాహుల్ కౌంటర్ ఇచ్చారు.  దీంతో లోక్ సభ రసాభసాగా మారింది.  

 రాహుల్‌ గాంధీ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన  క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులను కించపరచడుని,  రాహుల్ కేవలం బీజేపీ, ఆ పార్టీ నేతల గురించి మాత్రమే మాట్లాడారంటూ ప్రియాంక మద్దతుగా నిలిచారు.