మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం: ప్రియాంక గాంధీ

మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం:  ప్రియాంక గాంధీ

 దేశంలో ఫామ్ హౌస్ లో ఉండి పాలించే ఓకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ విమర్శించారు.  దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.  దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓవైసీ పోటీ చేస్తారని.. తెలంగాణలో మాత్రం అన్నిచోట్ల ఎందుకు పోటీ చేయరని ఆమె ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.

కార్నర్ మీటింగ్ లో ప్రియాంక వ్యాఖ్యలు:

  • అక్రమాలతో దేశంలో భాజపా, రాష్ట్రంలో బీఆర్ఎస్  ధనిక పార్టీలుగా మారాయి.
  • అదాని రుణాలు మాఫీ చేసే మోడీకి.. పేదల రుణాల మాఫీ ఎందుకు గుర్తుకు రాదు.
  • బీజేపీ, బిఅర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకటే
  • ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ గెలవకుండా కుట్ర చేస్తున్నాయి.
  • రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నమైంది.
  •  కరోనా సమయంలో దేశ ప్రజలు అల్లాడితే.. మోడీ ఆదుకోవడంలో విఫలం అయ్యారు.
  • చత్తీస్ ఘడ్, కర్ణాటక ప్రభుత్వాల తరహాలో తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తాం.
  •  తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం.
  •  రెండు లక్షల వరకు ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తాం.
  •  పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ 24 గంటలు పనిచేస్తుంది.
  • జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం:
  • చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది