మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు

మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార్జిషీటులో పొందపర్చారు అధికారులు. NRI వ్యాపారవేత్త అయిన సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు అయిన సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా.. ఛార్జీషీట్ లో ప్రియాంక గాంధీతోపాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ప్రస్తావించింది ఈడీ.. ఈ మేరకు డిసెంబర్ 28వ తేదీన ఈ విషయం బయటకు వచ్చింది.

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదే విధంగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. 

ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన థంపి, సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారనేది ఈడీ ఆరోపణ. ఈ క్రమంలోనే వారి పేర్లను ఛార్జిషీట్ లో నమోదు చేసింది ఈడీ...