నానితో మరోసారి ప్రియాంక.. OG డైరెక్టర్ సుజీత్ క్రేజీ సెలక్షన్

నానితో మరోసారి ప్రియాంక.. OG డైరెక్టర్ సుజీత్ క్రేజీ సెలక్షన్

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న హీరోయిన్‌‌ ప్రియాంక అరుళ్ మోహన్.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌లో ఛాన్స్‌‌ అందుకోబోతోంది. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్.. నాని హీరోగా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. దీనికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌‌ ప్రచారంలో ఉంది.

ఇక దర్శకుడు సుజీత్ ‘ఓజీ’ హీరోయిన్‌‌ ప్రియాంకను ఇందులోనూ రిపీట్ చేసే ప్లాన్‌‌లో ఉన్నాడట. ఇదే నిజమైతే మూడోసారి నానికి జంటగా ఆమె కనిపించనుంది. ఇప్పటికే వీళ్లిద్దరూ గ్యాంగ్ లీడర్‌‌‌‌, సరిపోదా శనివారం చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఏ హీరోయిన్‌‌తోనూ మూడుసార్లు కలిసి నటించలేదు. మరి ప్రియాంకకు ఈ అవకాశం దక్కుతుందేమో చూడాలి!