11న లక్నోకు ప్రియాంక గాంధీ… రాహుల్ తో కలిసి పర్యటన

11న లక్నోకు ప్రియాంక గాంధీ… రాహుల్ తో కలిసి పర్యటన

 ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, పూర్వాంచల్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ ఈనెల 11వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. వచ్చే సోమవారం రోజున లక్నోలో… కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తన అన్న రాహుల్ గాంధీతో కలిసి ఆమె పర్యటించనున్నారు. పశ్చిమ యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జ్యోతిరాదిత్య సింధియా కూడా రాహుల్, ప్రియాంకతో కలిసి పర్యటిస్తారు.

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పదవీ బాధ్యతలను బుధవారం తీసుకున్నారు ప్రియాంకగాంధీ. తనకోసం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో ఆమె పార్టీ గురించిన అంశాలపై నేతలతో చర్చించారు. తూర్పు యూపీలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై సంప్రదింపులు జరిపారు.