కబడ్డీ లవర్స్‎కు గుడ్ న్యూస్.. ఇవాళ్టి (ఆగస్ట్ 29) నుంచే ప్రొ కబడ్డీ స్టార్ట్

కబడ్డీ లవర్స్‎కు గుడ్ న్యూస్.. ఇవాళ్టి (ఆగస్ట్ 29) నుంచే ప్రొ కబడ్డీ స్టార్ట్

వైజాగ్: కబడ్డీ అభిమానులను అలరించడానికి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సిద్ధమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ సీజన్ వైజాగ్‌‌లో శుక్రవారం ప్రారంభం కానుంది. ఏడేళ్ల తర్వాత వైజాగ్‌‌కు తిరిగి వస్తున్న ఈ లీగ్ నేషనల్ స్పోర్ట్స్ డే రోజున మొదలవుతోంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్‌‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌‌లో బెంగళూరు బుల్స్‌‎తో పుణెరి పల్టాన్ పోటీ పడనుంది. 

సీజన్ ప్రారంభానికి ముందు పీకేఎల్ ఆర్గనైజర్స్‌‌, 12 జట్ల కెప్టెన్లు వైజాగ్‌‌లోని ఐఎన్ఎస్ కుర్సురా సబ్‌‌మెరైన్‌‌ను సందర్శించారు. పలు కొత్త మార్పులతో రాబోతున్న ఈ సీజన్‌‌ అత్యంత పోటీగా ఉంటుందని, గెలుపు సులభం కాదని  తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ పేర్కొన్నాడు. 

ఆతిథ్య జట్టుతో పోరు తమకు స్ఫూర్తినిస్తుందని, తమ బెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తమిళ్ తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ ధీమా వ్యక్తం చేశాడు. వైజాగ్‌‌లో సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్‌‌లు జరుగుతాయి. ఆ తర్వాత జైపూర్, చెన్నై, న్యూఢిల్లీ నగరాల్లో మిగిలిన లీగ్ మ్యాచ్‌‌లు షెడ్యూల్ చేశారు.