మేడిగడ్డలో ఏం జరుగుతున్నది?.. :కోదండరాం

మేడిగడ్డలో ఏం జరుగుతున్నది?.. :కోదండరాం
  • టీజేఎస్ చీఫ్ ​కోదండరాం

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ పంప్ హౌస్ లో ఏం జరుగుతుందో ప్రభుత్వం వైట్​పేపర్​రిలీజ్ చేయాలని, వివరణ ఇవ్వాలని టీజేఎస్ పార్టీ చీఫ్​ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. వచ్చిన వరద వచ్చినట్టే ఎత్తిపోయడానికి రీడిజైన్ చేసి మరీ ‘కాళేశ్వరం’ను నిర్మించినం అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు వరద వస్తుంటే ఆ నీళ్లను లిఫ్ట్ చేయకుండా వదిలిపెడుతున్నదని ఆరోపించారు. 

ALSO READ :వందే భార‌త్ రైలులో మంట‌లు.. త‌ప్పిన ఘోర ప్ర‌మాదం

ప్రాణహితకు ఈ సీజన్​లో ఇప్పటి వరకు 40 టీఎంసీల వరద నీరు వస్తే 34 గేట్లు ఎత్తి 23 టీఎంసీలను కిందికి వదిలేశారని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. జూన్ మొదటి వారం నుంచి నదిలో నీటి ప్రవాహం మొదలైందని, ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. వరద పెరగటంతో కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు అన్ని బయటపడుతున్నాయని తెలిపారు. గత వానకాలంలో మేడిగడ్డ పంప్ హౌస్ లు మునిగాయని, ఇంత వరకు వాటిని రిపేర్ చేయలేదా.. లేకపోతే కరెంట్ బిల్లులు కట్టలేదా అని ప్రశ్నించారు.