ఇండెంట్కు ఇబ్బందులు ! అమల్లోకి రాని యూనిఫైడ్ వెల్ఫేర్ హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్

ఇండెంట్కు ఇబ్బందులు ! అమల్లోకి రాని యూనిఫైడ్ వెల్ఫేర్ హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్
  • హాస్టళ్లలో మెనూ అమలు సమస్యలతో విద్యార్థులకు కష్టాలు
  • ఇంకా అప్​డేట్ కాని నాకాఫ్ రేట్లు.. పాత, కొత్త ధరల్లో తేడాలు
  •  ఆన్​లైన్​లో డైలీ ఇండెంట్ రైజ్ చేయడంలో సమస్యలు
  • వెంటనే అప్​డేట్ చేయాలంటున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు

మంచిర్యాల, వెలుగు: సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ వెల్ఫేర్ హాస్టల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్ (యూడబ్ల్యూహెచ్ఎంఎస్) పూర్తిస్థాయిలో అప్​డేట్ కాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు నాకాఫ్​ (ఎన్​ఏసీవోఎఫ్) రేట్ల ప్రకారం డైలీ ఇండెంట్ రైజ్ చేయడంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు (హెచ్​డబ్ల్యూవోలు) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త సిస్టమ్​లో భాగంగా హాస్టళ్లు, విద్యార్థులు, ఉద్యోగులు, మెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణతో పాటు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఏఎస్) వంటి ఆరు మాడ్యూల్స్​ను ప్రవేశపెట్టారు.

సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా అన్ని సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సంబంధిత ఆఫీసర్లు, సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ పలు సంస్థల్లో డేటా ఎంట్రీ, ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్​డేషన్​ పనులు పూర్తికాలేదు. గత నెలాఖరు వరకే డెడ్​లైన్​గా ప్రకటించినప్పటికీ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తప్పని సమస్యలు..
రాష్ర్టంలోని అన్ని కేటగిరీల విద్యాసంస్థలు, హాస్టల్స్​కు ఆహార పదార్థాలు, సరుకుల సప్లై కాంట్రాక్ట్​ను ప్రభుత్వం నాకాఫ్​ సంస్థకు అప్పగించింది. అయితే యూడబ్ల్యూహెచ్​ఎంఎస్​లో ఆహార పదార్థాలకు సంబంధించిన స్థిర ధరల పట్టిక లేని కారణంగా హెచ్​డబ్ల్యూవోలు ఇండెంట్ రైజ్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. నాకాఫ్ ధరల స్థిరీకరణ లేకపోవడంతో ఒక్కో స్టూడెంట్​కు రోజుకు ఎన్ని పరిమాణంలో ఆహార పదార్థాలు ఇవ్వాలో తెలియక అయోమయం నెలకొంది.

నాకాఫ్​లో లేని పెరిషబుల్ ఐటమ్స్ (చింతపండు, ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి, పాలు, పెరుగు) రేట్లను నిర్ణయించకపోవడం మరో సమస్యగా మారింది. ఒక స్టూడెంట్​కు అందించాల్సిన ఆహార పదార్థాల కొలతలు, ప్రతి రోజు హాస్టల్ విద్యార్థులకు అందించే డైలీ మెనూ వివరాలు లేకపోవడం వల్ల పాత, కొత్త రేట్లకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

దీంతో డైలీ మెనూ అమలు చేయడం కష్టంగా మారిందని హెచ్​డబ్ల్యూవోలు పేర్కొంటున్నారు. వెంటనే ఫుడ్ ప్రొవిజన్స్ రేట్​చార్ట్​ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆహార పదార్థాల కొలతలు, రేట్ చార్ట్, డైలీ మెనూపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. యూడబ్ల్యూహెచ్​ఎంఎస్​లో ఇండెంట్​ రైజ్ చేసే క్రమంలో హెచ్​డబ్ల్యూవోలకు సౌలభ్యంగా ఉండేవిధంగా మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే సరుకులను ప్రైవేట్ పర్చేజ్ చేయవద్దని ఆదేశాలు ఉండడంతో అన్ని ఫుడ్ ప్రొవిజన్స్ సకాలంలో హాస్టళ్లకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఫండ్స్ కొరత కారణంగా హాస్టళ్ల మెయింటనెన్స్ కష్టతరంగా మారిందని, 2025–26తో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమర్పించిన 130-132, 500-503 హెడ్ల కింద పెండింగ్ బిల్లలు సాంక్షన్ చేయాలని కోరుతున్నారు.  

కొత్త సిస్టమ్తో అక్రమాలకు చెక్​... 
హాస్టళ్ల నిర్వహణను పూర్తిగా యూడబ్ల్యూహెచ్​ఎంఎస్ ద్వారా మానిటరింగ్​ చేయడం ద్వారా అవినీతి, అక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో స్టూడెంట్లు, టీచర్లు, ఇతర స్టాఫ్ అటెండెన్స్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా పక్కాగా ట్రాక్ చేయవచ్చు. హాస్టళ్లలోని భవనాలు, మౌలిక వసతులు, ఇతర సదుపాయాలను స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించే వీలుంటుంది. అలాగే విద్యార్థులకు అందించే ఫుడ్ క్వాలిటీ, డైట్ చార్జీలు, మెనూ అమలును పర్యవేక్షించడం మరింత ఈజీ అవుతుంది. హాస్టళ్లు, స్కూళ్ల పరిసరాల్లో శానిటేషన్, పరిశుభ్రతను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా రోజువారీ స్టాక్ ఎంట్రీలు, కాస్మోటిక్ చార్జీలు, కరెంట్ బిల్లులు, ట్రెజరీ బిల్లులను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ద్వారా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించి గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దడానికి ప్రత్యేక డ్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే ముందుగా సాఫ్ట్​వేర్​ను అప్డేట్​ చేసి, పెండింగ్​డేటా ఎంట్రీ పనులు పూర్తి చేయడంతో పాటు ఫుడ్​ఐటెంట్స్​ ధరలు, మెనూపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.