గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోరు... సమస్యలు పరిష్కరించరు

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోరు... సమస్యలు పరిష్కరించరు

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. సుమారు 70 రోజులుగా నగరానికి పూర్తి స్థాయి కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించి సమస్యలను పరిష్కరించాల్సిన ఆఫీసర్లు కుర్చీలకే పరిమితం అయ్యారు. అలాగే కార్పొరేటర్లు, ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో పాటు నిధుల కొరత కారణంగా నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ కొత్త కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాషా నియామకం కావడం, ఆదివారం ఆయన చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవడంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదులు పట్టించుకుంటలే..

గ్రేటర్​ వరంగల్ లో 66 డివిజన్లు ఉండగా వాటి పరిధిలో మొత్తం 42 విలీన గ్రామాలున్నాయి. నగరం లో డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవడంతో కాలనీలు కంపుకొడుతున్నాయి.  మరోవైపు రోడ్లు, నాలాలు ఆక్రమణకు గురవుతూ, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా లేక దోమలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతి వారం 50కి తగ్గకుండా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆఫీసర్లు మాత్రం అర్జీలు తీసుకోవడం వరకే పరిమితం అవుతూ సమస్యల పరిష్కరానికి గాలికి వదిలేస్తున్నారు. ఇటీవల గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ‘గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌరులు’ పేరున కనిపించిన కరపత్రాలు కలకలం రేపాయి. 

కుక్కలు, కోతులతో ఇబ్బందులు

నగరంలో కుక్కలు, కోతులతో పాటు పందుల బెదడ ఎక్కువగా ఉంది. ఒక్కో డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేల సంఖ్యలో ఉన్న కుక్కలు జనాలపై దాడులు చేస్తున్నాయి. నెల కు ఐదారు వందల మంది కుక్కకాటుకు గురై హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పరుగులు తీస్తున్నారు. మూడు రోజుల కిందట కాజీపేటలో ఓ బాలుడిని చంపివేశాయి. అప్పటికప్పుడు కుక్కలు పట్టే పేరుతో హడావుడి చేసిన ఆఫీసర్లు తర్వాత లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఏడాదిన్నర కింద కోతుల గుంపు ఎగబడడంతో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీది నుంచి పడి చనిపోయింది. ఇక పందులను సిటీ అవతలికి తరలించి, వాటి పెంపకందారులకు పునరావాసం కల్పిస్తామన్న మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి. 

రోడ్లు సక్కగ లేవు.. నీళ్లొస్తలేవు

స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీగా ఎంపికైన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్లు సక్కగ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. సివిల్​వర్క్స్​చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.80 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉండడంతో వారు 2 నెలల కింద పనులు నిలిపేశారు. ఆ తర్వాత కొన్ని నిధులిచ్చినా కొందరికీ బిల్లులు రాకపోవడంతో చాలాచోట్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్నేండ్ల కిందట చేపట్టిన స్మార్ట్​రోడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉండగా.. అధ్వానమైన రోడ్లతో జనాలు ప్రతిరోజూ నరకం చూస్తున్నారు. ఇక గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతి ఇంటికీ ప్రతిరోజూ వాటర్​ సప్లై చేస్తామని లీడర్లు, ఆఫీసర్లు హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పదుల సంఖ్యలో లీకేజీలు, పైపులైన్లు సరిగా లేకపోవడంతో ఇండ్లకు నీరు అందడం లేదు. 

కొత్త కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఆశలు

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న ప్రావీణ్య మార్చి 13న వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. అప్పటి నుంచి గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, కుడా వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు. మూడూ ముఖ్యమైన పోస్టులే కావడంతో ఆమె గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెద్దగా ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయారు. దీంతో పాలన మొత్తం గాడి తప్పింది. సుమారు 70 రోజుల తర్వాత కొత్త కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాషాను ప్రభుత్వం నియమించింది. 2017 ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఈయనను గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతికుమారి ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. దీంతో ఆదివారం సాయంత్రం ఆయన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. అడిషనల్​ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉర్​ రషీద్, సీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రాజేశ్, సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాసరావు, పీఆర్వో ఆయూబ్​అలీ, ఎంప్లాయిస్​ జేఏసీ అధ్యక్షుడు గౌరీ శంకర్, ఇతర సిబ్బంది  కలిసి బొకేలు అందజేసి స్వాగతం పలికారు.