కీళ్ల నొప్పులతో ఇబ్బందా? అయితే ఇలా చేసి చూడండి..

కీళ్ల నొప్పులతో ఇబ్బందా? అయితే ఇలా చేసి చూడండి..

ఒకప్పుడు అరవై ఏళ్లకు జాయింట్ పెయిన్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు నలభై ఏళ్లకే నాలుగు అడుగులు కూడా వేయలేకపోతున్నారు చాలామంది. వింటర్ సీజన్‌లో అయితే మరీ ఎక్కువగా జాయింట్ పెయిన్స్​తో బాధపడుతుంటారు. చికెన్ గునియా వంటి జ్వరాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్నింగ్ లేవడమే నొప్పులతో లేస్తుంటారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్​లోనూ ఆ సమస్యల నుంచి రిలీఫ్ రావొచ్చు అంటున్నారు డాక్టర్లు. 

వింటర్ సీజన్​లో చర్మం ఎలాగైతే పొడిబారుతుందో అలాగే శరీరం లోపల కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి. నెయ్యి గడ్డ కట్టినట్టుగా కొన్ని ఫ్లూయిడ్స్ గడ్డ కడుతుంటాయి. అయితే రెగ్యులర్ ఎక్సర్ సైజులు చేస్తూ మంచి ఫుడ్ తింటే వీటికి దూరంగా ఉండొచ్చు.

మారిన లైఫ్ స్టైల్

ఎవరి లైఫ్ లో చూసినా ఉరుకులు పరుగులే. పని ఒత్తిడి, అధిక బరువు, హెల్దీ ఫుడ్ తినకపోవడం, ఎక్సర్ సైజులు లేకపోవడం వంటివి పెరిగిపోతున్నాయి. దీనివల్లే చాలామంది చిన్న వయసులో ఆర్థరైటిస్ బారిన పడుతుంటారు. సాధారణంగా బాడీలో ఎముకల చివరలో ఉండే కార్టిలేజ్.. కుషన్​లా పనిచేసి కీళ్ల కదలికలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇవి ఫ్రీగా కదలడానికి కారణం వీటి మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్. అయితే చలికాలంలో ఇది గడ్డకడుతుంది. దీనివల్ల కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి. బరువు ఎక్కువగా ఉన్నా, వయసు పైబడిన వాళ్లైనా, పిరియడ్స్ ఆగిపోయిన మహిళలు, సరైన కేర్ తీసుకోలేని వాళ్లలో ఈ కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి.

వయసు పెరుగుతున్నా..

యాభై ఏళ్లు దాటినవాళ్లలో కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్లు ఎక్కువ కేర్ తీసుకోవాలి. రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేయాలి. అయితే పెద్ద పెద్ద ఎక్సర్ సైజులు చేయకూడదు. ఇవి చేసేముందు స్లోగా స్ట్రెచ్ చేయాలి. ఒక వేళ రెగ్యులర్​గా ఎక్సర్ సైజులు చేయడం అలవాటు ఉన్న వాళ్లైతే చేయొచ్చు. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి. రాత్రుళ్లు చలికి ఎక్స్ పోజ్ కాకూడదు.

మెడికల్ కండిషన్ ఉన్నవాళ్లలో..

ఆర్థరైటిస్, చికెన్ గునియా, కొన్ని రకాల జ్వరాలు వచ్చి తగ్గిపోయిన వాళ్ళలో కీళ్ల  సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. జ్వరం టైంలో వచ్చే బాడీ టెంపరేచర్ వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. అలాగే ఈ టైంలో చర్మం పొడిబారినట్లే లోపల కండరాలు, కీళ్లు  కూడా బిగుతుగా అవుతాయి. దీనివల్ల నొప్పులు వస్తుంటాయి. అయితే వీటి నుంచి రిలీఫ్ పొందాలంటే కచ్చితంగా మందులు వాడాలి.

మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి

శరీరంలో మెటబాలిక్ స్టేజెస్​ని బట్టి శరీరం ఎంత హెల్దీగా ఉందో అర్ధమవుతుంది. అందుకే మెటబాలిజాన్ని బ్యాలెన్స్​డ్​గా ఉంచాలి. దీనికోసం ప్రొటీన్, క్యాల్షియం, మెగ్నీషియం ఉండే ఫుడ్ సమానంగా తినాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు దుంపలు తినొద్దు. సీజనల్ ఫుడ్ తినాలి. వీటితో పాటు ఏ వయసువారైనా ఎక్సర్ సైజెస్​ చేయాలి. చేయమన్నారు కదాని అదేపనిగా ఎక్సర్‌‌సైజులు చేయడమూ మంచిది కాదు. లిమిట్​గా చేయాలి. కింద కూర్చోవడం, వంగడం వంటి వాటికి ఈ సీజన్​లో దూరంగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటే వెంటనే ట్రీట్​మెంట్ తీసుకోవాలి.

– డా. జి మనోజ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్దోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

మరికొన్ని..

కీళ్లను వెచ్చగా ఉంచేందుకు వామ్ క్లాత్‌తో చుట్టాలి. చేతులకు గ్లోవ్స్, మోకాళ్లకు నీ క్యాప్ వేసుకోవడం వల్ల కూడా నొప్పులను తగ్గించొచ్చు.

వింటర్ లో నీళ్లు తాగడం తగ్గిపోతుంది. దాంతో డీహైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల నొప్పులు మరింత పెరుగుతాయి. అందుకే ఈ సీజన్‌లో ఎక్కువగా నీళ్లు తాగాలి.

క్యాల్షియం, విటమిన్ –డితో పాటు వాపును తగ్గించే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ తినాలి. డి– విటమిన్ ఉండే మష్రూమ్, డైరీ ప్రొడక్ట్స్​ను రెగ్యులర్ ఫుడ్​లో చేర్చాలి.

ప్రతీరోజూ ఉదయం లేవగానే బాడీ స్ట్రెచింగ్ చేయాలి. పెయిన్స్ ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి నొప్పి ఉన్న ప్లేస్‌లో బట్టతో కాపడం పెట్టాలి.

వాపు ఎక్కువగా ఉంటే ఐస్ ప్యాక్ పెడితే రిలీఫ్ ఉంటుంది.

గోరువెచ్చని నువ్వుల నూనెతో మర్దన చేసినా జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.

బరువు ఎక్కువగా పెరుగుతున్నా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి.

చల్లటి నీళ్లతో స్నానం చేయకుండా గోరువెచ్చటి నీళ్లతో చేయడం మంచిది.

For More News..

తిరంగా చీరకు తెగ డిమాండ్

ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

మహిళను కొట్టిన టీఆర్ఎస్ కార్పొరేటర్​ను అరెస్ట్​ చెయ్యాలె

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్