AlluAravind: సింగిల్ కలెక్షన్స్‌‌లో కొంత సైనికులకు.. విరాళం ప్రకటించిన నిర్మాత అల్లు అరవింద్

AlluAravind: సింగిల్ కలెక్షన్స్‌‌లో కొంత సైనికులకు.. విరాళం ప్రకటించిన నిర్మాత అల్లు అరవింద్

‘సింగిల్’సినిమా నుంచి వచ్చే కలెక్షన్స్‌‌లో  కొంత భాగాన్ని దేశం కోసం పోరాడుతున్న సైనికులకి అందజేస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా లీడ్ రోల్స్‌‌లో కార్తిక్ రాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు  తాము ఊహించినదానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని టీమ్ చెప్పింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌‌మీట్‌‌ పెట్టాం. మన దేశం కోసం పోరాడుతున్న సైనికులకి ఇక్కడ నుంచి సపోర్ట్‌‌ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా నుంచి వచ్చే కలెక్షన్స్‌‌లో కొంత భాగం అందజేయనున్నాం.

ఈ ఉద్రిక్త పరిస్థితులకు ముందే మా సినిమా రిలీజ్ డేట్‌‌ ప్రకటించాం. సినిమా ఇండస్ట్రీ, థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉండడంతో.. ఎవరూ తప్పుగా అర్థంచేసుకోరనే ధైర్యంతో సినిమాని విడుదల చేశాం. అద్భుతంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’అని అన్నారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోందని హీరో హీరోయిన్స్, దర్శక నిర్మాతలు చెప్పారు.