పథకం ప్రకారం అరెస్ట్.. 14రోజుల రిమాండ్

పథకం ప్రకారం అరెస్ట్.. 14రోజుల రిమాండ్

బండ్ల గణేష్ కు కడప కోర్ట్ 14రోజుల రిమాండ్ విధించింది. కమెడియన్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్లగణేష్ చుట్టు ఉచ్చు బిగుస్తుంది.  సినిమాలు తీసేందుకు ఫైనాన్సర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న బండ్ల…వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్, కడప, ఢిల్లీలలో కేసులు నమోదయ్యాయి. 2011లో  కడప జిల్లాకు చెందిన మహేష్ వద్ద గణేష్ రూ.13కోట్లు అప్పుతీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో 2013లో మహష్ కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన మొత్తాన్ని చెల్లించలేదని, చెక్ బౌన్స్ కింద కేసు పెట్టాడు. బండ్ల గణేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నిమిత్తం కోర్ట్ కు హాజరు కావాలని పలుమార్లు కడప కోర్ట్ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు రెస్పాండ్ కాకపోవడంతో కోర్ట్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో  నిర్మాత పీవీపీ ఇంటిపై దాడి కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బండ్ల గణేష్ ను… బంజారాహిల్స్ పోలీసులు పథకం ప్రకారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన గణేష్ ను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప జిల్లా కోర్ట్ కు హాజరుపరిచారు. కేసును విచారించిన కోర్ట్ 14రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పించింది.