
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్(Boney kapoor) శ్రీదేవి బయోపిక్(Sridevi Biopic) పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను బతికి ఉండగా తన భార్య బయోపిక్ చేయడానికి అనుమతించనని అన్నారు. ప్రస్తుతం బోనీకపూర్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా బోనీకపూర్ నిర్మాతగా చేస్తున్న మైదాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను అమిత్ రవీందర్నాథ్ శర్మ తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు మైదాన్ చిత్ర నిర్మాత బోనీకపూర్. ఈ సందర్బంగా తన భార్య శ్రీదేవి బయోపిక్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా భార్య(శ్రీదేవి) తన వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేది. వ్యక్తిగత విషయాలు బయటికి తెలియాల్సిన అవసరం లేదని తన ఫీలింగ్. ఆమె ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను. బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంది. అందుకే.. నా భార్య ఆలోచనల ప్రకారం తన బయోపిక్‌ను తీయడానికి నేను ఒప్పుకొను. నేను బతికి వున్నంత వరకు ఆమె బయోపిక్ తీయలేరు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బోనీకపూర్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: రామ్ చరణ్ తాతయ్యగా బిగ్ బి.. హైపెక్కిస్తున్న RC16 లేటెస్ట్ అప్డేట్!
నిజానికి చాలా రోజులుగా అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ చేయాలని చాలా మంది మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. ఈ మేరకు బోనీకపూర్ తో సంప్రదింపులు కూడా జరిగాయని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో శ్రీదేవి బయోపిక్ పై బోనీకపూర్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి.