RC16: రామ్ చరణ్ తాతయ్యగా బిగ్ బి.. హైపెక్కిస్తున్న RC16 లేటెస్ట్ అప్డేట్!

RC16: రామ్ చరణ్ తాతయ్యగా బిగ్ బి.. హైపెక్కిస్తున్న RC16 లేటెస్ట్ అప్డేట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో RC16(RC 16) ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటంటే.. RC16 దర్శకుడు బుచ్చిబాబు సన(Buchibabu sana) ఈ సినిమా కోసం సెట్ చేస్తున్న స్టార్ కాస్ట్. అవును.. ఈ సినిమా కోసం డిఫరెంట్ ఇండస్ట్రీల నుండి స్టార్ యాక్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు బుచ్చిబాబు. ఇప్పటికే ఈ సినిమా కోసం కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, తమిళ ఇండస్ట్రీ నుండి విజయ్ సేతుపతిని తీసుకున్న బుచ్చి.. హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేశారు. 

ఇక ఈ భారీ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ ను తీసుకున్నాడు. దీంతో ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. అయితే.. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో మరో స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఆ స్టార్ మరెవరో కాదు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఈ సినిమాలో రామ్ చరణ్ తాత పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. అందుకే.. ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండాలని అమితాబ్ ని తీసుకున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని టాక్. అమితాబ్ రాకతో RC 16పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ఇక RC 16 సినిమా విషయానికి వస్తే.. రా అండ్ రస్టిక్ కథాంశంలో రానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని టాక్. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు పాటలు రికార్డింగ్ కూడా జరిగిందని చెప్పారు ఏఆర్ రహమాన్. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న  ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ తారాగణంతో, పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.