వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్.. 

వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్.. 

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక పక్క అభ్యర్థుల నామినేషన్లు, మరో పక్క  ముమ్మరంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం వెరసి రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో పలువురు నేతలకు టాలీవుడ్ కి చెందిన సెలెబ్రిటీలు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల కూటమి అభ్యర్థులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలకడం సంచలనంగా మారగా, తాజాగా నిర్మాత దిల్ రాజు వైసీపీ అబ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది. 

బాలినేని మద్దతుగా ఒక వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు దిల్ రాజు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగొలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. బాలినేని రాజకీయ ప్రస్థానంపై ఒక డాక్యుమెంటరీ రూపొందించాను. అది అందరూ చూడాలని దిల్ రాజు అన్నారు.బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశానన్న దిల్ రాజు ఆయనను గొప్ప నేతగా అభివర్ణించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ ప్రాంత అభివృద్ధికి బాలినేని పాటుపడ్డారని దిల్ రాజు అన్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.