మాస్‌‌ను మెప్పించేలా ఆదికేశవ

మాస్‌‌ను మెప్పించేలా ఆదికేశవ

వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సోమవారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌కి వస్తున్న రెస్పాన్స్ నుంచి చాలా ఆనందంగా ఉంది. 

ప్రేక్షకులు మెచ్చే సినిమాని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా మెప్పిస్తుంది’ అని అన్నాడు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఈ ఏడాది సంక్రాంతి సినిమాల తర్వాత వస్తున్న పూర్తి స్థాయి మాస్‌‌ సినిమా ఇది. 

మాస్‌‌తో పాటు లవ్, కామెడీ, ఎమోషన్, ఫైట్స్‌‌తో ఎంటర్‌‌‌‌టైన్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌‌లో రొమాన్స్ ఎంత బాగుంటుందో సెకెండాఫ్‌‌లో యాక్షన్‌‌ అంతలా మెప్పిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక, సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది.