
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘కిష్కింధపురి’. సెప్టెంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఆదివారం విజయవాడలో టీమ్ సందడి చేసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఈ కంటెంట్ మీద నమ్మకంగా ఉన్నాం. చాలా హారర్ సినిమాలు చూస్తుంటారు. కానీ ఇది మాత్రం ప్రత్యేకం. ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. నిజమైన హంటింగ్ హౌస్ లో దీన్ని షూట్ చేశాం. ఆడియెన్స్‌కు బెస్ట్ హారర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది’ అని చెప్పాడు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇదొక యూనిక్ హారర్. హారర్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. తెలుగు బెస్ట్ హారర్ మూవీస్‌లో ఒకటిగా ‘కిష్కింధపురి’ నిలుస్తుంది’ అని చెప్పింది.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఎందరో దర్శకులు చాలా రకాల హారర్ కథలతో వచ్చారు. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్‌గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండిటి బ్లెండ్‌తో చాలా కొత్త కథ చెప్పారు దర్శకుడు కౌశిక్.
ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్.. దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్‌ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ మన తెలుగులో రాలేదని’ చెప్పారు.