సచిన్ రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ జంటగా వినయ్ రెడ్డి చందుపట్ల దర్శకత్వంలో సింధుసూర్య నిర్మిస్తున్న చిత్రం ‘శివ గాడి జిందగీ’. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు వినయ్ రెడ్డి చందుపట్ల మాట్లాడుతూ ‘ఇది కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు.. మన సమాజంలోని ప్రతి సగటు మనిషి జీవితానికి ఒక చక్కటి ప్రతిరూపం.
జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు, స్నేహం, ప్రేమ, భావోద్వేగాలను చాలా సహజంగా చూపే ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్కరినీ ఈ కథ ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. నిర్మాత సింధుసూర్య మాట్లాడుతూ ‘కామెడీ, ఎమోషన్, డ్రామా, ఫ్రెండ్‌షిప్, లవ్ వంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
