శాసనసభ మూవీ స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్

శాసనసభ మూవీ స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ శాసనసభ. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకత్వం వహించారు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక సాంగ్ లో కనిపించి కుర్రకారు మనస్సులను దోచుకోనుంది. ఈ సాంగ్ కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అందాల తార హెబ్బాపటేల్ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలకు సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవిబసుర్ మ్యూజిక్ శాసనసభ మూవీకి హైలైట్‌గా నిలుస్తుందన్నారు. స్పెషల్ సాంగ్ లో హెబ్బాపటేల్  స్టెప్పులు  మాస్‌ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుందని చెప్పారు.  శాసనసభ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.