ప్రతి లెక్చరర్ ​అంబాసిడర్ ​డ్యూటీ చేయాలె

ప్రతి లెక్చరర్ ​అంబాసిడర్ ​డ్యూటీ చేయాలె
  • ట్రిపుల్​ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

బాసర, వెలుగు: వర్సిటీలో విధులు నిర్వహించే ప్రతి లెక్చరర్ ఓ​ అంబాసిడర్​గా పనిచేయాల్సిన అవసరం ఉందని బాసర ట్రిపుల్​ ఐటీ ఇన్​చార్జ్​ వీసీ ప్రొఫెసర్ ​గోవర్ధన్ ​అన్నారు. శనివారం వర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ అధికారులు,13 విభాగాల అధిపతులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 

సెల్ఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నినాదాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు. అకడమిక్, ఎగ్జామినేషన్ సెక్షన్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ప్రొక్యూర్మెంట్, నెట్​వర్కింగ్ అండ్ సాఫ్ట్​వేర్​ సెక్షన్ల అధికారులు తమ నివేదికలు అందించాలని ఆదేశించారు. అనంతరం అధ్యాపకులు, నాన్ టీచింగ్ ఉద్యోగులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.

 అసోసియేట్ డీన్స్, పలు విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బాసరలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.