చత్తీస్గఢ్ ఫైరింగ్పై స్పందించండి : ప్రొఫెసర్ హరగోపాల్

చత్తీస్గఢ్ ఫైరింగ్పై స్పందించండి : ప్రొఫెసర్ హరగోపాల్
  • హక్కుల సంఘాలకు ప్రొఫెసర్ హరగోపాల్ సూచన

హైదరాబాద్, వెలుగు: చత్తీస్​​గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్​లో 30 వేల మంది కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు మావోయిస్టులను, ఆదివాసీలను చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.  బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మావోయిస్టులను లొంగిపొమ్మని హెచ్చరిస్తున్నారని,  లేదంటే చావుకు సిద్ధం కావాలంటూ బెదిరిస్తున్నారన్నారు.

ఆ ప్రాంతంలో  గణపతి, హిడ్మా వంటి నాయకులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు.  ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వామపక్ష పార్టీలు, మేధావులు ఈ మారణహోమం పై వెంటనే స్పందించాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. చట్ట ప్రకారం హత్యలు చేయడం, హత్య చేస్తామని పోలీసులు హెచ్చరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని మండిపడ్డారు.