ఉపా చట్టం రద్దుకు ఉద్యమిస్తాం: ప్రొఫెసర్ హరగోపాల్

ఉపా చట్టం రద్దుకు ఉద్యమిస్తాం: ప్రొఫెసర్ హరగోపాల్

తప్పుడు కేసు కాబట్టే తనపై పెట్టిన దేశ ద్రోహం కేసు ఎత్తివేశారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తనపైనే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) చట్టం పెట్టిన ప్రతి ఒక్కరిపైన కేసులు  ఎత్తివేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల వలే వ్యవహరించింది కానీ ఉద్యమ పార్టీలా వ్యవహరించలేదన్నారు. ఇటువంటి ప్రభుత్వం తెలంగాణాలో వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. 

ఉపా చట్టం అనేది ఒక దుర్మార్గమయిన చట్టమని..ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం పోరాడుతామన్నారు హరగోపాల్.  ఈ చట్టాల ద్వారా స్వేచ్చగా మాట్లాడే అవకాశం కోల్పోతామన్నారు. నిర్భంద చట్టాలపై ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరినీ చైతన్య పరుస్తామన్నారు. అన్ని సంఘాలతో కలిసి  తమ పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు.  ప్రొఫెసర్ హరగోపాల్ పై పెట్టిన దేశద్రోహం కేసు ఎత్తివేయాలని  డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ప్రొఫెసర్ హరగోపాల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదయ్యింది. దీని ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఏడాది క్రితమే పెట్టినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చచింది. దీనిపై ఉద్యమకారులు,మేధావులు,  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసును ఎత్తేవేయాలంటూ కేసీఆర్ ఆదేశమిచ్చారు.

https://www.youtube.com/watch?v=xri56lHGirk