ఎన్నికల ముందు నోటిఫికేషన్..ఎన్నికలయ్యాక క్యాన్సిల్.. టీఎస్పీఎస్సీ పైసల్ సంపాదించే మిషనా..?

ఎన్నికల ముందు నోటిఫికేషన్..ఎన్నికలయ్యాక క్యాన్సిల్.. టీఎస్పీఎస్సీ పైసల్ సంపాదించే మిషనా..?

టీఎస్పీఎస్సీని బీఆర్ఎస్ ప్రభుత్వం పైసలు సంపాదించే మిషన్ గా తయారు చేశారని ఆరోపించారు ప్రొఫెసర్ కోదండరాం. టీఎస్పీఎస్సీ ఏర్పాటయ్యాక.. ఇప్పటివరకు అర్థవంతంగా , తప్పులు లేకుండా తెలంగాణలో పరీక్షలు పూర్తి చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక నిర్వహించిన పరీక్షలు చాలా తక్కువ అని చెప్పారు. 

Also Read :- బతుకమ్మ, దసరాకు ప్రత్యేక బస్సులుhttps://www.v6velugu.com/ts-rtc-special-buses-for-bathukamma-and-dussehra

తెలంగాణలో 3.10 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే..కేవలం 90 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నిక తరువాత క్యాన్సిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వాహకంతో 2022లో 22 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మికుంటలో షబ్బీర్ అనే వ్యక్తి నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్పష్టంగా తెలిపినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే సమస్యకు పరిష్కారం ఉండదని హెచ్చరించారు.